Site icon NTV Telugu

Bandi Sanjay : బండి సంజయ్‌ను భుజాలపై ఎత్తుకుని పరేడ్ మైదానమంతా తిరిగిన బీజేపీ కార్యకర్తలు

Bandi Sanjay

Bandi Sanjay

ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని ఈ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌ బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. అయితే.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో బండి సంజయ్‌ను భుజాలపై ఎత్తుకుని పరేడ్ మైదానమంతా బీజేపీ కార్యకర్తలు తిరిగారు. హిందూ టైగర్ బండి సంజయ్…. కాబోయే సీఎం సంజయ్ అంటూ నినాదాలతో పరేడ్ గ్రౌండ్ మారుమ్రోగింది. జైలు నుండి విడుదలైన బండి సంజయ్ ను కలిసేందుకు అడుగడుగునా కార్యకర్తలు ముందుకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ‘‘బండి’’ని భుజం తట్టి అభినందించారు మోడీ.. ఎలా ఉన్నావ్ అంటూ ఆత్మీయంగా పలకరించారు.బీజేపీ బలోపేతం కోసం చేస్తున్న పోరాటాలు భేష్… భుజం తట్టి అభినందించడం గమనార్హం. ఒకవైపు నరేంద్రమోడీ, మరోవైపు బండి సంజయ్ నామస్మరణతో ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ మైదానమంతా మోగిపోయింది. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో అక్రమంగా అరెస్టై జైలుకు వెళ్లిన బండి సంజయ్ నిన్న బెయిల్ విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read : Abhishek Nama: ఏడేళ్ళ కల ఎప్పటికి నెరవేరేనో!?

ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం లభించింది. పరేడ్ మైదానంలో బండి సంజయ్ అడుగు పెట్టగానే వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి… హిందూ టైగర్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేయడం ఆరంభించారు. అదే సమయంలో కార్యకర్తలు బండి సంజయ్ ను తమ భుజాలపై ఎత్తుకుని పరేడ్ మైదానమంతా తిప్పుతూ ‘‘‘హిందూ టైగర్ సంజయన్న…..జై బండి సంజయన్న… జైజై బండి సంజయన్న…. కాబోయే సీఎం బండి సంజయ్… సంజయన్న నాయకత్వం వర్ధిల్లాలి’’ అంటూ నినదించారు. ఆ తరువాత కొద్ది సేపటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రావడంతో వాతావరణమంతా ‘‘మోడీ…మోడీ’’ నామస్మరణతో నిండిపోయింది. ప్రధాని ప్రసంగం ముగించి వెళ్లిపోయిన తరువాత బండి సంజయ్ తిరుగు ముఖం పడుతుండగా మళ్లీ కార్యకర్తలంతా బండి వద్దకు వచ్చి భుజాలపై ఎత్తుకుని సంజయన్న నాయకత్వం వర్దిల్లాలి… కాబోయే సీఎం బండి సంజయ్ అంటూ నినదిస్తూ తిరగడం గమనార్హం.

Also Read : PM Modi : బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసిన ప్రధానమంత్రి

Exit mobile version