Kolkata: రన్‌వేపైకి ఒకేసారి రెండు విమానాలు.. తప్పిన పెద్ద ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఒకే రన్ వేపైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమాన రెక్కలు విరిగిపడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
ఒక విమానం చెన్నైకి వెళ్తుంటే.. మరొక విమానం దర్భంగాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా డీజీసీఏ పేర్కొంది. ఒకే రన్ వేపైకి వచ్చి ఢీకొట్టుకోవడంతో విమానాల రెక్కలు విరిగిపోయాయని తెలిపింది. ఇక ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..

బుధవారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిరిండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఇండిగోకు చెందింది కాగా.. కోల్‌కతా నుంచి దర్భంగాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండు విమానాలు ఒకేసారి రన్‌వేపైకి వచ్చేశాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ వెల్లడించింది. విచారణ సమయంలో సిబ్బందిని కూడా విచారిస్తామని తెలిపింది. ఈ ఘటన తర్వాత పైలట్లను విధుల నుంచి తొలగించాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన రెక్కలు రన్‌వేపై పడి ఉన్నాయి.

తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!