Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో మానవ జీవితంలో పనులు సులభతరమైనప్పటికీ, దీనికి సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ AI వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత శక్తివంతమైన AI మోడళ్ల తయారీని నియంత్రించేందుకు అమెరికా చట్టసభ సభ్యులు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పెద్ద టెక్ కంపెనీలు తమంతట తాముగా తీసుకునే భద్రతా చర్యలు AI ప్రమాదాలను అరికట్టడానికి సరిపోవవని ఆయన స్పష్టం చేశారు.
AI అభివృద్ధిని నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం చట్టాలు చేయాలా వద్దా అని అడిగిన ప్రశ్నకు బిల్ గేట్స్ స్పందిస్తూ ‘ఖచ్చితంగా అవసరమే’ అని బదులిచ్చారు. AI కంపెనీలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించాలనే దానిపై రాజకీయ నాయకులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు చర్చల్లో భాగం కావాలని ఆయన సూచించారు. ఈ నిబంధనలు స్వచ్ఛందంగా కాకుండా తప్పనిసరిగా ఉండాలని అన్నారు. దీనివల్ల టెక్ పరిశ్రమపై కొంత అదనపు భారం పడినప్పటికీ, వారి పనులకు ఎలాంటి పెద్ద ఆటంకం కలగదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం టెక్ కంపెనీలు తమ స్వంత నిబంధనలపై మాత్రమే ఆధారపడలేవన్నారు.
Also Read
- Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
- Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
- DGP CV Anand: "పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం".. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
- Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం టెక్ పరిశ్రమలో మరింత వేగంగా, శక్తివంతమైన AI సిస్టమ్‌ల అభివృద్ధిపై చర్చ జరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి ప్రముఖ AI కంపెనీల ఉన్నతాధికారులు సైతం AI అభివృద్ధి వేగంపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఫ్రాంటియర్ AI సిస్టమ్స్ అభివృద్ధిని కొంత మందగించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు, AI కంపెనీల మధ్య మరింత సహకారం ఉండాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై కోరారు. అలాగే AI సామర్థ్యాలు, ప్రమాదాలు, భద్రతా చర్యలను కవర్ చేసే అంతర్జాతీయ ప్రమాణాలు కావాలని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మ్యాన్ డిమాండ్ చేశారు. సామర్థ్యాలను కొలవడం, ప్రమాదాలను అంచనా వేయడం, భద్రతా చర్యలు సరిపోతాయో లేదో నిర్ధారించడం, AIపై మానవ పర్యవేక్షణను కొనసాగించడం ఈ ప్రమాదాల ముఖ్య ఉద్దేశం కావాలని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో అత్యంత అధునాతన సిస్టమ్‌లను మానవులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళనలతో పాటు, ప్రస్తుత AI సాంకేతికతను దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని బిల్ గేట్స్ హెచ్చరించారు. “AI అనేది బిలియన్ల మంది ప్రజల మరణాలకు కారణమయ్యేలా విపత్తులను సృష్టించగలదు” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడు ఉద్దేశాలు ఉన్నవారు సరికొత్త AI టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తివంతమైన ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా అత్యంత అధునాతన స్థాయికి చేరుకోకముందే AI వల్ల పెద్దఎత్తున నష్టం జరిగే ముప్పు పొంచివుందన్న వాస్తవాన్ని బిల్ గేట్స్ మాటలు బలంగా గుర్తుచేస్తున్నాయి.
- Tags
- AI
- Bill Gates
- Security
- Technology
తాజావార్తలు
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!