Son Hires Contract Killers: బుడిబుడి అడుగులు వేస్తే మురిసిపోయే తండ్రిని, తప్పటడుగులు వేస్తున్న క్రమంలో సరిదిద్దే నాన్నను ఓ కొడుకు సుపారీ ఇచ్చి మరీ చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దారుణం అండీ ఇది.. కన్న తండ్రిని, సొంత కొడుకు చంపాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసి ఖతం చేయాలని ప్లాన్ చేయడం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. బిహార్‌లోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన ఒక కొడుకు తన తండ్రిని చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించుకున్నాడు. కాంట్రాక్ట్ కిల్లర్లు సరిగ్గా దాడికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. కొడుకు ఇంత ఘాతుకానికి పాల్పడటానికి కారణం ఏంటో తెలుసా?
READ ALSO: Rahul Ravindran: మణిరత్నం..బోయపాటి బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి కొడుకుని కంటే వాడే సుజిత్!
ఆస్తి ఇవ్వకుండా చేశాడు..
తండ్రిని హత్య చేయాలను చూసిన కేసులో నిందితుడైన కొడుకు, ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. తన కొడుకు ప్రేమ వివాహం తర్వాత తండ్రి తన ఆస్తిని కొడుకుకు వారసత్వంగా ఇవ్వకుండా చేశాడు. దీనితో ఆ కొడుకు తండ్రిపై కోపం పెంచుకొని.. ఏకంగా తండ్రి హత్యకు ప్లాన్ చేశాడు. కతిహార్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందానికి దసరా లోపు లేదా ఆ తర్వాత కాంట్రాక్ట్ హత్య జరుగుతుందని సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కాంట్రాక్ట్ కిల్లర్ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ కేసు ఆధారంగా ప్రాన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దుర్గా ఘాట్ నుంచి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఒక కట్టా, ఐదు లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కొడుకు ఇచ్చిన కాంట్రాక్ట్‌తో తండ్రి హత్యకు ప్లాన్..
పోలీసుల దర్యాప్తులో నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపాడ నివాసి ఫిరోజ్ అన్సారీ అలియాస్ సద్దాం తన తండ్రిని హత్య చేయడానికి కుట్ర పన్నాడని తేలింది. దీనికి నిందితుడు రూ.10 లక్షలకు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీస్ సూపరింటెండెంట్ శిఖర్ చౌదరి మాట్లాడుతూ.. ఫిరోజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పారు. దీనికి ఆగ్రహించిన ఆయన తండ్రి తన ఆస్తిని ఫిరోజ్ వారసత్వంగా పొందకుండా చేశాడు. దీంతో ఫిరోజ్ తన తండ్రిపై కోపం పెంచుకొని, తండ్రిని చంపడానికి కాంట్రాక్టును మాట్లాడాని చెప్పారు. నిందితుడి కాంట్రాక్ట్ కిల్లర్లైన శుభం కుమార్, సాజిద్ అన్సారీ, అజామ్ అన్సారీలతో తన తండ్రి హత్యకు ఎంత డబ్బు అవసరమో, ఇతర వివరాలకు సంబంధించిన లిఖితపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లతో పాటు ఫిరోజ్‌ను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లూ నగరంలో కార్మికులుగా పనిచేస్తున్న కతిహార్ నివాసితులని చెప్పారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
READ ALSO: Asia Cup 2025 Prize Money: దాయాదుల పోరులో గెలిచిన వాళ్లకు ఎన్ని కోట్లో తెలుసా?