Son Hires Contract Killers: బుడిబుడి అడుగులు వేస్తే మురిసిపోయే తండ్రిని, తప్పటడుగులు వేస్తున్న క్రమంలో సరిదిద్దే నాన్నను ఓ కొడుకు సుపారీ ఇచ్చి మరీ చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దారుణం అండీ ఇది.. కన్న తండ్రిని, సొంత కొడుకు చంపాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేసి ఖతం చేయాలని ప్లాన్ చేయడం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. బిహార్‌లోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాకు చెందిన ఒక కొడుకు తన…
Tragic: హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ కొడుకు తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు రవీందర్ చదువు కోసం సుమారు ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని చదువుల మీద కాకుండా, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి పోగొట్టేశాడు రవీందర్. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తీవ్రంగా మందలించాడు. Kasam…
ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. సంఘటనా స్థలంలోని స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి తుపాకీ, 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్ x రోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.