Russia Army Shoes : బీహార్ నగరం హాజీపూర్ అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది. బీహార్ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఈ దిశలో పాట్నా తర్వాత హాజీపూర్ కూడా బీహార్‌లో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అవతరిస్తోంది. హాజీపూర్‌లో, రష్యన్ సైన్యం కోసం బూట్లు , యూరోపియన్ మార్కెట్‌ల కోసం డిజైనర్ షూలు తయారు చేయబడుతున్నాయి. వీటిని తయారు చేయడం ద్వారా హాజీపూర్ అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది.
హాజీపూర్‌కు చెందిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన కాంపిటెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రష్యన్ ఆర్మీ కోసం షూలను తయారు చేస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో స్థానం సంపాదించింది. మరోవైపు, ఈ కంపెనీకి మరో పెద్ద విజయం ఏమిటంటే.. మహిళలు కూడా కంపెనీలో చేయిచేయి కలిపి పనిచేయడం. అలాగే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కంపెనీ జనరల్ మేనేజర్ శిబ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ కంపెనీలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల్లో 70 శాతం మంది మహిళలే అన్నారు.
Read Also:Malla Reddy Arrest: పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత..
ఈ కంపెనీని 2018లో హాజీపూర్‌లో ప్రారంభించామని.. ఈ సంస్థ లక్ష్యం ఉపాధిని సృష్టించడమని కంపెనీ జనరల్ మేనేజర్, శివ్ కుమార్ రాయ్ తెలిపారు. హాజీపూర్‌లో రష్యాకు ఎగుమతి చేసే సేఫ్టీ షూలను తయారు చేస్తున్నామన్నారు. త్వరలో దేశీయ మార్కెట్‌లో కూడా ప్రారంభిస్తామన్నారు. రష్యా సైన్యం కోసం బూట్ల డిమాండ్ గురించి రాయ్ మాట్లాడుతూ.. బూట్లు తేలికగా, జారిపోకుండా ఉండాలని, -40 డిగ్రీల సెల్సియస్ వంటి చల్లని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవని చెప్పారు.
రష్యాలోని అతిపెద్ద ఎగుమతిదారులలో తమ కంపెనీ ఒకటి అని జనరల్ మేనేజర్ చెప్పారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని అంచనా. కంపెనీ ఎండి దనేష్ ప్రసాద్ బీహార్‌లో ప్రపంచ స్థాయి ఫ్యాక్టరీని నిర్మించాలని, రాష్ట్ర ఉపాధికి దోహదపడాలని కోరుకుంటున్నారు. 300 మంది ఉద్యోగుల్లో 70 శాతం మంది మహిళా ఉద్యోగులకు గరిష్టంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గతేడాది రూ. 100 కోట్ల విలువైన 15 లక్షల జతల షూలను ఎగుమతి చేశామని, వచ్చే ఏడాది దీన్ని 50 శాతానికి పెంచాలన్నది తమ లక్ష్యమని జనరల్ మేనేజర్ శివ్ కుమార్ రాయ్ తెలిపారు.
Read Also:Mallikarjun Kharge: మోడీ వ్యాఖ్యలపై ఖర్గె ఫైర్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు