Bihar Elections 2025: దేశం చూపు బీహార్ వైపు ఉంది. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అన్ని చాలా ప్రతిష్టా్త్మకంగా తీసుకున్న తరుణంలో పోటీ రసవత్తరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో NDA – మహా కూటమి పక్షాలు అత్యంత వెనుకబడిన తరగతుల (EBCs) ఓట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. ఎన్నికల్లో వీళ్లు నిర్ణయాత్మకంగా ఉంటారని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. RJD పశ్చిమ చంపారన్ నుంచి ముజఫర్‌పూర్, దర్భంగా వరకు విస్తరించి ఉన్న 42 సీట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానాల్లో సుదీర్ఘకాలంగా NDA బలమైన పాగా వేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కోటను ఆర్జేడీ బద్దలు కొడుతుందా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: INDW vs AUSW: అబ్బా సాయిరాం.. ఆస్ట్రేలియాతోనే భారత్ సెమీస్!
ఓటర్లను ఆకర్షిస్తున్న తేజస్వి యాదవ్..
మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తే, ముఖేష్ సాహ్ని డిప్యూటీ సీఎం అవుతారని ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లకు సాంప్రదాయకంగా విధేయులుగా ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మల్లా, కేవత్, బింద్, కశ్యప్ వంటి ఉప కులాలను కలిగి ఉన్న నిషాద్ కమ్యూనిటీ బీహార్ జనాభాలో దాదాపు 5.5 శాతం ఉన్నారు. ముఖేష్ సాహ్ని చాలా కాలంగా ఈ వర్గానికి షెడ్యూల్డ్ కుల హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అలా చేస్తే రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలు కోపగించుకోవచ్చు, రిజర్వేషన్ల విభజనను వారు వ్యతిరేకించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలివిగా తేజస్వి దానికి సంబంధించిన ఎలాంటి వాగ్దానం చేయకుండా ఉన్నారని చెబుతున్నారు. అయితే సాహ్నికి డిప్యూటీ సీఎం పదవిని ప్రకటించడం NDAకి తీవ్రమైన సవాలుగా మారవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర, వాయువ్య బీహార్‌లోని మత్స్యకార ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న సుమారు 30 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలను వీళ్లు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ సాహ్ని పేరును ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో లాలూ యాదవ్ కుటుంబం ఇతర వర్గాలతో అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుందనే సంకేతాన్ని సూచిస్తోంది. అయితే ముఖేష్ సాహ్నికి ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. సహర్సాలోని సిమ్రి భక్తియార్‌పూర్ నుంచి 2020 లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయిన నేపథ్యంలో దాని ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా కనిపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ముజఫర్‌పూర్‌లోని జాలర్ల సంఘం, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, వైశాలి, దర్భాంగా ఉత్తరప్రదేశ్, ఖగారియా వంటి జిల్లాలను బీజేపీ కంచు కోటగా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంపారన్‌లోని 21 సీట్లలో బిజెపి 15 సీట్లను గెలుచుకుంది, అలాగే ఎన్డీఏ కూటమి ముజఫర్‌పూర్‌లోని 11 సీట్లలో తొమ్మిది, దర్భంగాలోని 10 సీట్లలో తొమ్మిది స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న సవాలును గ్రహించిన నాయకత్వం ఇటీవల మల్లా నాయకుడు, ముజఫర్‌పూర్ మాజీ ఎంపీ అజయ్ నిషాద్‌ను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన భార్యకు ఔరాయ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో మహా కూటమి పట్టు చిక్కించుకోడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ల ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బహిర్గతం కానున్నాయి.
READ ALSO: Liechtenstein: సొంత కరెన్సీ లేని సంపన్న దేశం.. నిరుద్యోగం జాడ కూడా దొరకదు!