NTV Telugu Site icon

Priyanka Jain: శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక.. ఇంతకు ఏమైందంటే ?

New Project (8)

New Project (8)

Priyanka Jain: తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదు. కేవలం వినోదం కోసమే ఆ వీడియో చేశామని ప్రకటించారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీయాలన్నో లేక భక్తుల మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. తెలియక చేసిన తప్పుని మీరందరూ క్షమించాలని కోరుతున్నామన్నారు.

Read Also:Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వేలంలో ఉంటే.. రూ.520 కోట్లు కూడా సరిపోవు!

అసలేమైందంటే.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అడ్డమైన పనులు చేస్తున్నారు. ఇటీవల ప్రాంక్ వీడియోలు బాగా పెరిగాయి. వాటికి విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్‌లు వస్తున్నాయి కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో అవ్వడం తప్పేమీ కాదు. కానీ ఏం చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రాంక్ వీడియోలు తీస్తున్నారు. తాజాగా అలాంటి పనే చేసింది బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక. ఇటీవల ప్రియాంక తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో కొన్ని రీల్స్ చేశారు ఈ ఇద్దరు.

Read Also:Harish Rao: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హరీష్ రావుపై కేసు నమోదు

చిరుత అరుపును రీల్స్‌లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. తీరా చూస్తే అక్కడ చిరుత కనిపించలేదని అంతా తూచ్ అంటూ ఫ్రాంక్ చేశారు. గతంలో కూడా ఇదే స్థలంలో చిరుతపులి ఓ చిన్నారిని చంపేసింది. ఇలాంటి చేష్టలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పవిత్ర తిరుమలలో భక్తి భావం లేకుండా రీల్స్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఇదే విధంగా ఫ్రాంక్ చేయడంతో వారిపై టీటీడీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రియాంకపై కూడా టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Show comments