తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఎలిమినేషన్ కోసం సర్వం సిద్ధం చేసింది షో యాజమాన్యం.. మొదటి నుంచి అనుకున్న విధంగా కాకుండా ఓటింగ్ లో భారీ ట్విస్ట్ ఇచ్చింది.. ఒక టాప్ సెలెబ్రేటీని హౌస్ నుంచి బయటకు రానున్నట్లు సమాచారం.. ఫస్ట్ వీక్ ముగియగా ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభమైంది. నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు..
ఈ వారం మొదటి రెండు రోజులు నామినేషన్ ప్రక్రియ మొదలైంది.. ఎప్పటిలానే ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని తగు కారణాలు చెప్పి ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. మెజారిటీ కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన 8 మంది ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు.. శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది..
మొదట్లో శోభా శెట్టి రెండో ప్లేస్ లో ఉండగా రతికా తన గేమ్ తో ఆమెను వెనక్కి సెటైర్ రెండో స్థానం కైవసం చేసుకుందట. మూడో ప్లేస్ లో శోభా శెట్టి ఉండగా, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో షకీలా కొనసాగుతున్నారట. ఇక ఆరో స్థానంలో ప్రిన్స్ యావర్, ఏడో స్థానంలో దామిని, చివరి స్థానంలో కిరణ్ రాథోడ్ ఉన్నారట.. అయితే ఎలిమినేట్ అయ్యేది ఆమె అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరోవైపు శివాజీ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. దామిని కూడా సరిగ్గా పెర్ఫార్మన్స్ చెయ్యలేదని టాక్.. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..