Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ రేవంత్ తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 01 గురువారం నాడు రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. కూతురు పుట్టిందనే విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేవంత్ కి తెలియజేయడంతో అతడు పట్టరాని ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అయితే కూతురు పుట్టిందనే విషయాన్ని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రేవంత్‌కి తెలియజేస్తూ అతని లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్యూటిఫుల్ మెమెరీని అందించారు బిగ్ బాస్. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హిస్టరీలో బ్యూటిఫుల్ మూమెంట్ ఇదని…. రేవంత్ కూతుర్ని లైవ్‌లో చూపించారు.
Read Also: Hair Transplant : బట్టతల పోతదనుకుంటే బతుకే లేకుండా పోయింది
ఆస్పత్రి నుంచి రేవంత్ భార్య అన్విత.. తన బిడ్డను చూపించగా.. అతడు ఒకింత ఎమోషనల్ అయ్యాడు. కూతుర్ని చూసి మురిసిపోయాడు. ‘మన యువరాణి జూనియర్ రేవంత్‌ని చూపించు’ అంటూ భార్యతో చెప్పి కూతుర్ని చూసి ఆనందంలో మునిగిపోయాడు. వెంటనే ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’ అంటూ పాట పాడి ఎమోషనల్ అయ్యాడు రేవంత్.. సార్ నేను ఇక్కడే గెలిచాను సార్’ అంటూ బిగ్ బాస్‌కి థాంక్స్ చెప్పాడు రేవంత్. నాగార్జునతో ఈ సమయంలో భార్య పక్కన లేకుండా పోయానని, తన బిడ్డను ఎత్తుకోలేకపోయానని బాధపడ్డాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేవంత్ పాట పాడుతుంటే మా కళ్లలో నీళ్లు వచ్చేశాయి, రేవంత్ పాపను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.