NTV Telugu Site icon

Elon Musk: పుట్టిన రోజున ఎలాన్ మస్క్ కు భారీ షాక్..అదేంటంటే ?

New Project (7)

New Project (7)

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు. ఇప్పుడు మొదటి స్థానంలో అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాను సవరించింది. కొత్త జాబితా ప్రకారం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కాగా ఉన్నారు.

READ MORE: Kalki 2898 AD: మొదటి రోజు కల్కి ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

ఈ ఇద్దరు బిలియనీర్ల నికర విలువలో పెద్దగా తేడా లేదు. బుధవారం వరకు.. “ఎక్స్”, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ గురువారం.. జెఫ్ బెజోస్ నికర విలువ ఎలాన్ మస్క్ కంటే $ 3 బిలియన్లు ఎక్కువగా మారింది. ఎలాన్ మస్క్ నికర విలువ $751 మిలియన్లు పెరిగి.. మొత్తం నికర విలువ $217 బిలియన్లకు చేరుకుంది. అదే సమయంలో.. జెఫ్ బెజోస్ నికర విలువ $ 3.97 బిలియన్లు పెరిగి.. మొత్తం సంపద $ 220 బిలియన్లకు చేరుకుంది. అంటే కేవలం 3 బిలియన్ డాలర్ల మార్జిన్‌తో జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు

READ MORE: Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు

టాప్-10 బిలియనీర్ల జాబితా..
టాప్-10 బిలియనీర్ల జాబితాలో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ తర్వాత బెర్నార్డ్ ఎన్రాల్ట్ నిలిచాడు. ఈ జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ నాలుగో స్థానంలో, లారీ పేజ్ ఐదో స్థానంలో, బిల్ గేట్స్ ఆరో స్థానంలో నిలిచారు. అదే సమయంలో, స్టీవ్ బాల్మర్ ఏడో స్థానంలో, సెర్గీ బ్రిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. టాప్-9లో లారీ ఎల్లిసన్, టాప్-10లో వారెన్ బఫెట్ ఉన్నారు.

Show comments