Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏం జరిగింది? భూమన ఫైర్..

Bhumana Karunakara Reddy

Bhumana Karunakara Reddy

ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రూ. 2కోట్ల 7 లక్షలు మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకుండా మోసం చేశారన్నారు‌. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని చెప్పారని.. తల్లికి వందనంలో లక్షలాది తల్లులకు మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండానే చేశానని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు..

READ MORE: PM Modi: సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీ.. స్వయంగా అధ్యక్షుడి స్వాగతం.. ఈ చిన్న దేశానికి ఎంతో ప్రాధాన్యత..

ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టు తప్ప ఏం జరిగింది? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. “కూటమీ ప్రభుత్వం లో మహిళల పై దాడులు పెరిగాయి‌.. ప్రశ్నస్తే జైల్లో పెడుతున్నారు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసం కూటమీ ప్రభుత్వం చేసింది‌. రైతులకు 20 వేలు ఇస్తామని మోసం చేశారు చంద్రబాబు. తల్లికి వందనం కోసం ప్రశ్నించే వాళ్ళను బెదిరిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మోసాలు, ఒక అభూత కల్పనతో చంద్రబాబు మోసగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై దాడులు చేయించి, కేసులు పెట్టీ, జైల్లో పెట్టించారు. రూ. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version