Bhumana Karunakar Reddy: ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏం జరిగింది? భూమన ఫైర్..
- ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించింది
- ప్రసారమధ్యమల్లో మా నాయకుడు పై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది
- జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారు
- రూ. 2కోట్ల 7 లక్షలు మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకుండా మోసం చేశారు
- వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రూ. 2కోట్ల 7 లక్షలు మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకుండా మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని చెప్పారని.. తల్లికి వందనంలో లక్షలాది తల్లులకు మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండానే చేశానని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు..
Also Read
ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టు తప్ప ఏం జరిగింది? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. “కూటమీ ప్రభుత్వం లో మహిళల పై దాడులు పెరిగాయి.. ప్రశ్నస్తే జైల్లో పెడుతున్నారు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసం కూటమీ ప్రభుత్వం చేసింది. రైతులకు 20 వేలు ఇస్తామని మోసం చేశారు చంద్రబాబు. తల్లికి వందనం కోసం ప్రశ్నించే వాళ్ళను బెదిరిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మోసాలు, ఒక అభూత కల్పనతో చంద్రబాబు మోసగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై దాడులు చేయించి, కేసులు పెట్టీ, జైల్లో పెట్టించారు. రూ. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!