AP Crime: ప్రతీ నిత్యం ఏదో ఒక దగ్గర చిన్నారులు, బాలికలు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ఓవైపు కఠినశిక్షలు పడుతున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.. తాజాగా, కర్నూలు జిల్లాలో ఇంటర్ చదువుతోన్న బాలికను కిడ్నాప్ చేసి.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆటో డ్రైవర్..
Read Also: Kraigg Brathwaite: విండీస్ ప్లేయర్ వెరీ స్పెషల్.. ఒక్క టీ20 ఆడకుండానే వరల్డ్ రికార్డు
ఆదోనీలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండ గురుకుల స్కూల్ లో ఇంటర్ చదువుతున్న బాలిక.. వైద్యం నిమిత్తం తన తల్లితోపాటు సొంతూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చింది.. అయితే, పొరపాటున ఆదోనీ బస్సు ఎక్కిందట బాలిక.. ఇక, చేసేది ఏమీ లేక .. ఎమ్మిగనూరు బస్సు కోసం ఆదోనీ బస్టాండ్ లో ఎదురు చూస్తుండగా కన్నేసిన ఆటో డ్రైవర్ రమేష్… బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు.. నిర్మానుష్య ప్రదేశానికెళ్లి.. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. బాలకపై పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుండగా.. అర్ధరాత్రిసమయంలో ఆదోనీలోని బాలికల హాస్టల్ దగ్గర వదిలేశాడు.. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటో డ్రైవర్ రమేష్ పై ఫోక్సో కేసు నమోదు.. అరెస్ట్ చేశారు..