Bhojshala case: “భోజ్‌శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- భోజ్‌శాల ఒక దేవాలయం..
- మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhojshala case: మధ్యప్రదేశ్ హైకోర్టు ‘‘భోజ్‌శాల కేసు’’లో సంచలన తీర్పు వెలువరించింది. ధార్‌లోని ఈ భోజ్‌శాల సరస్వతీ దేవీ ఆలయంగా హైకోర్టు గుర్తించింది. మందిర్-మసీదు కేసుల్లో ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసులో హిందూ పక్షానికి కీలక విజయం లభించింది. హిందువులకు పూజ చేసుకునే అవకాశం లభించింది. సరస్వతీ దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఈ కేసులో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) రిపోర్టును ప్రస్తావించింది. ఇది ఒక సంస్కృత విద్యా కేంద్రంగా హైకోర్టు పేర్కొంది. ముస్లింలు మసీదు కోసం ప్రభుత్వాన్ని స్థలం కోరవచ్చని చెప్పింది.
జైన్ సమాజ్, ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. న్యాయవాది విష్ణు శకంర్ జైన్ మాట్లాడుతూ.. ఈ కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని, హిందూ భక్తులకు కోర్టు హక్కుల్ని కల్పిస్తుందని చెప్పారు. హిందూ పక్షం తన వాదనల్ని వినిపిస్తూ ఖిల్జీ ఆదేశాల మేరకు ఆలయాన్ని కూల్చివేశారని, పరమార వంశానికి చెందిన రాజు భోజుడు క్రీ.శ. 1034వ సంవత్సరంలో భోజ్‌శాల ప్రాంగణంలో సరస్వతీ దేవికి అంకితం చేస్తూ ఒక ఆలయాన్ని నిర్మించారని కోర్టుకు విన్నవించారు. క్రీ.శ. 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆదేశాల మేరకు ఈ ఆలయం కూల్చివేయబడిందని, ఆ తర్వాత ఆ ఆలయ శిథిలాలను ఉపయోగించి అక్కడ ఒక మసీదు నిర్మించబడిందని చెప్పారు.
Also Read
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్‌కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
ఏఎస్ఐ సర్వే, శాస్త్రీయ అధ్యయనాలపై ఆధారపడి తీర్పు చెప్పింది. జూలై 2024లో, వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయంపై ఏఎస్ఐ తన శాస్త్రీయ సర్వే నివేదికను మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు సమర్పించింది. చాలా ఏళ్లుగా హిందువులు ప్రతీ మంగళవారం పూజలు చేసుకునేందుకు, ముస్లింలు ప్రతీ శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి ఏఎస్ఐ అనుమతించింది. ఈ వివాదాస్పద స్థలంలో హిందువుల పూజలు ఎన్నడూ ఆగలేదని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. హిందువుల ఆరాధన హక్కులను పరిమితం చేస్తూ, ముస్లిం సమాజాన్ని ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించిన 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వును హైకోర్టు రద్దు చేసింది. 2023 నాటి ఉత్తర్వులు హిందువుల హక్కుల్ని పరిమితం చేసిందని, అందువల్ల అది చెల్లదని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్‌కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్‌లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!