LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్‌బక్స్ తన పునరుద్ధరణ చర్యల్లో భాగంగా 300 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు.. కొన్ని అమెరికా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే.. కాఫీహౌస్ (స్టోర్) ఉద్యోగులపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కోతలు కేవలం మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి సపోర్ట్ విభాగాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ ఉద్యోగులకు ఎలాంటి ముప్పు లేనప్పటికీ, యూఎస్ వెలుపల ఉన్న కార్పొరేట్ నిర్మాణాన్ని కూడా సమీక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అట్లాంటా, డల్లాస్, చికాగో వంటి నగరాల్లో సరిగా వినియోగంలో లేని కార్యాలయాలను స్టార్‌బక్స్ మూసివేస్తోంది. మరోవైపు, టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది రాబోయే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మొత్తం పునరుద్ధరణ ప్రక్రియ వల్ల కంపెనీపై 400 మిలియన్ డాలర్ల భారం పడనుండగా, అందులో 120 మిలియన్ డాలర్లు ఎఫెక్ట్ అయిన ఉద్యోగుల ప్రయోజనాల కోసమే ఖర్చు కానుంది.
Also Read
2024లో చైర్మన్ అండ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్ నేతృత్వంలో స్టార్‌బక్స్ ఖర్చులు, సంక్లిష్టతలను తగ్గించే పనిలో పడింది. గత ఏడాది కూడా ఈ సంస్థ 2,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించి, వందలాది స్టోర్లను మూసివేసింది.
ఈ నిర్మాణం వల్ల కంపెనీ వేగంగా ఆవిష్కరణలు చేయగలుగుతోందని నికోల్ తెలిపారు. కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ ఏడాది 1,000 అమెరికా స్టోర్లను మరింత సౌకర్యవంతంగా రీడిజైన్ చేయడంతో పాటు, రద్దీ సమయాల్లో వేగవంతమైన సేవల కోసం అదనపు బారిస్టాలను నియమించుకుంటున్నారు. ఈ వ్యూహాల వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో యూఎస్ సేమ్-స్టోర్ అమ్మకాలు 7 శాతం పెరిగాయి. ఈ పురోగతిని స్థిరమైన ఫలితాలుగా మార్చడమే తమ తదుపరి లక్ష్యమని నికోల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!