Ministry of Defence Approved Varuntej’s Operation Valentine after Rejecting 15 Scripts: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా చెబుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఇక 2019లో కలకలం రేపిన పుల్వామా ఎటాక్స్, తదనంతర ఎయిర్ స్ట్రైక్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ తో కలిసి, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద దీనిని నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా గురించి తాజాగా వరుణ్ తేజ్ వెల్లడించిన కొన్ని అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు విషయం ఏమిటంటే ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అదేమంటే భారతీయ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాస్తవ సంఘటనలపై సినిమాలు తీయడానికి అలాగే రక్షణ విభాగాలకు చెందిన క్యాంపుల్లో సినిమాలను చిత్రీకరించడానికి మేకర్స్ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందాలి.
Nani: మొన్న అయాన్.. నేడు జున్ను.. టాలెంటెడ్ నెపో కిడ్స్ రా మావా..
ఇక ఆపరేషన్ వాలెంటైన్ మేకర్స్ ఈ కథతో రక్షణ మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్ళినప్పుడు పుల్వామా ఉగ్రదాడి ఆధారిత సినిమాలకు సంబంధించి వివిధ నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన 16 స్క్రిప్ట్‌లను తిరస్కరించినట్టు తమకి వెల్లడించారని వరుణ్ తేజ్ అన్నారు. అంతేకాదు స్క్రిప్ట్ చూసినప్పుడే కాదు సినిమాను రూపొందించడానికి మా టీం చేసిన గ్రౌండ్ వర్క్ చూసి ఆపరేషన్ వాలెంటైన్‌ని ఆమోదించారని అన్నారు. ఇక గ్వాలియర్‌లోని అత్యంత సురక్షితమైన వైమానిక దళ స్థావరంలో షూట్ చేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా వారు తమ సినిమాకి మద్దతునిచ్చారని అన్నారు. ఇక వరుణ్ తేజ్ చెబుతున్న దాని ప్రకారం దాదాపు 40 రోజుల పాటు గ్వాలియర్‌లోని వైమానిక దళ స్థావరంలో సినిమా యొక్క ప్రధానమైన పోర్షన్ షూట్ చేశారు. షూటింగ్ సమయంలో ఎయిర్ ఫోర్స్ అధికారుల నుండి పూర్తి మద్దతు లభించిందని అన్నారు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అయితే ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.