Bhatti Vikramarka: బీఆర్ఎస్ నాయకులు ఖమ్మంలో 10కి 10 గెలుస్తారట..! నాకు నవ్వొస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలుస్తాం అంటున్నారు…నాకు నవ్వొస్తుంది.. అంటూ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక స్వాగతమన్నారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం చెపుతున్నానని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్ని మీకు విదితమే ఇది ఒక్క జిల్లాకే కాదు రాష్ట్రం మొత్తం ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు రాజకీయ పునరేకీకరణ జరుగుతుందన్నారు. పదేళ్లు తెరాస పాలనతో విసిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తాం అని రేపు cwc లో ప్రకటన చేస్తున్నామన్నారు. తెరాస నాయకులు ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలుస్తాం అంటున్నారు…నాకు నవ్వొస్తుందంటూ భట్టి అన్నారు. 2014 లో గెలిచిన జలగం వెంకట్రావు, 2018 లో పువ్వాడ అజయ్ కూడా కాంగ్రెస్ వాసన తోనే గెలిచారని తెలిపారు. పొంగులేటి ఎంపీ గా గెలిచింది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు వలనే గెలిచారని అన్నారు. పొంగులేటి వలన తెరాస లాభపడింది కానీ పొంగులేటికి వారి వలన లాభం జరగలేదన్నారు.
రేపు కూడా ఖమ్మం జిల్లాలో 10 కి 10 గెలుస్తామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలో కాంగ్రెస్ కి పూర్తి అవగాహన ఉందన్నారు. నాడు సాయుధ పోరాటం చేసిన దానిలో గానీ, నీళ్ళ కోసం, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వారిలో ఖమ్మం జిల్లా వారు ఉన్నారన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఇండ్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం…అందరికీ పింఛన్లు ఇచ్చామన్నారు. కేసీఆర్ రాక ముందే అందరికీ రేషన్ బియ్యం సరుకులతో సహా ఇచ్చామని గట్టిగ గ్రామాల్లో చెప్పండని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. కళ్యాణ లక్ష్మి కంటే ముందే నేను స్పీకర్ గా బంగారు తల్లి అని చట్టం చేశామన్నారు. 2 లక్షల పతకం బంగారం తల్లి పథకం తగ్గించి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారని తెలిపారు. ఏ పతకం గొప్పదో గ్రామంలో చెప్పండి? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది బంగారు తల్లి పథకానికి తిరిగి ఇస్తామని తెలిపారు. గతంలో ఇంట్లో ఎందరు వృద్ధులు ఉన్న వారందరికీ ఇచ్చాం ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందన్నారు. ఇంట్లో వృద్ధులు ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తామని గ్రామాల్లో గట్టిగా చెప్పండన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతులకు ఉన్న రుణాలు మొత్తం ఒకేసారి చేశాం.. కానీ కెసిఆర్ ఇప్పుడు ఇస్తా అన్న రుణమాఫీ ఎక్కడ? మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కచ్చితంగా 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారు.
Also Read
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
కేసీఆర్ ఇస్తా అన్న రెండు పడకల ఇండ్లు ఎక్కడ ఆయన ఇస్తా అన్న ఇండ్లు ఇవ్వకపోగ హౌసింగ్ బోర్డుని ఎత్తేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ముదిగొండ మండలం ఉన్న ప్రతి కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే అని అన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఇండ్లు కట్టుకోడానికి ఇండ్ల స్థలం ఇండ్లు కట్టుకోడానికి 5 లక్షలు ఇస్తాం sc,st లకు 6 లక్షలు ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టించారు ఆ నిధులు ఎక్కడ అని నేను గట్టిగా అడిగితే దళిత బంధు ఇస్తానున్నం అని చెపుతున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క దళిత కుటుంభానికి 12 లక్షల దళిత బంధు పతకం అమలు చేస్తాం…దానికి cwc లో అమలు ఎలా చేస్తాం అని ప్రకటిస్తామన్నారు. అనేక సమస్యలు ఉన్నారు ప్రతి గ్రామం తిరిగాను సమస్యలు విన్నా, చూశా ఆ సమస్యలు తీర్చడానికి మేనిఫెస్టో లో కచ్చితంగా హామీలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు అనేక వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ లు ఇచ్చాం…కానీ నేడు అవి అన్ని అపేసి రైతు బందు ఇస్తున్నాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సబ్సిడీ లో వ్యవసాయ పనిముట్లు ఇస్తూ, రైతు బందు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా తెస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు గుంజుకుంటే తిరిగి రైతులకు ఇస్తామని భట్టి తెలిపారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!