కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు ఈ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఆ పాదయాత్ర గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం. మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పిప్పిరి గ్రామంలో ప్రారంభమైంది. మార్చి 22న కెరిమెరి మండలం ఝరి గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 125 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 14న మంచిర్యాల పట్టణంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సత్యాగ్రహ సభ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం తెచ్చేలా జరిగింది.
Naga Babu: అప్పుడు పవన్‌ని నడిపించాను.. ఇప్పుడు అడుగుజాడల్లో నడుస్తున్నాను
ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. దాదాపు లక్షమంది ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. ఏప్రిల్ 16న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టువద్ద 300 కిలోమీటర్ల మైల్ స్టోన్ ను తాకిన పీపుల్స్ మార్చ్.. మార్చి 29 జనగామ జిల్లా నర్మెట్టలో 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.
మే 5న భువనగిరి నియోజకవర్గం మగ్గంపల్లి గ్రామంలో 600 కిలోమీటర్లు, చేవెళ్ల నియోజకవర్గం రామానుజాపూర్ లో 700 కిలోమీటర్ల పాదయాత్రను పీపుల్స్ మార్చ్ అందుకుంది. జడ్చెర్ల నియోజకవర్గం కేశవరాంపల్లిలో 800 కిలోమీటర్ల చేరుకోవడంతో పాటుగా.. అదేనెల 25న జడ్చెర్ల పట్టణంలో పీపుల్స్ మార్చ్ భారీ భహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Siddharth: ఆదితి రావుతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిన సిద్ధార్థ్
ఈనెల 11న దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లికి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించడంతో.. వెయ్యి కిలోమీటర్లను మార్క్ ను చేరుకుంది. మండే ఎండల్లో నడవడం వల్ల మే 18న మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి గ్రామంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ తో స్వల్ప అస్వస్థతకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురయ్యారు. వైద్యుల సూచనతో 5 రోజులు విశ్రాంతి తరువాత మళ్లీ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆయన మొదలు పెట్టారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన నాటినుంచీ ఇప్పటివరకూ.. ఒక్కసారి కూడా వాహనాన్ని వినియోగించకుండా.. అసలైన పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పిస్తూ భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.
