Siddharth Reacts On Dating Rumours With Aditi Rao Hydari: సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ ఓపెన్‌గానే డేటింగ్ చేసుకుంటున్నారు. మొదట్లో కాస్త సీక్రెట్‌గా తమ రిలేషన్‌షిప్‌ని మెయింటెయిన్ చేశారు కానీ, ఆ తర్వాత ఓపెన్ అయిపోయారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈవెంట్లకు కూడా కలిసే హాజరవుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఇద్దరు కలిసి పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. ‘మహా సముద్రం’ సాక్షిగా కలిసిన వీళ్లిద్దరు.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. కానీ.. ఏనాడూ వీళ్లు తమ డేటింగ్‌పై స్పందించలేదు. టన్నులకొద్దీ వార్తలు వస్తున్నా.. చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు కానీ, నోరు మాత్రం మెదపడం లేదు. ఓసారి ఆదితికి డేటింగ్‌పై ప్రశ్న ఎదురైతే.. దాని గురించి మాట్లాడకుండా ఏదో లెక్చర్ ఇచ్చింది. ‘జనాలకు నచ్చింది ఎంజాయ్ చేస్తారు.. నేను నాకు నచ్చింది చేసుకుంటూపోతా’ అని చెప్పింది.
Basit Ali: భారత్ బౌలింగ్ ఐపీఎల్లోలాగే ఉంది.. కోచ్‌గా ద్రవిడ్ జీరో
అయితే.. తాజాగా సిద్ధార్థ్ మాత్రం తన డేటింగ్ వార్తలపై స్పందించాడు. అతడు నేరుగా క్లారిటీ ఇవ్వలేదు కానీ, పరోక్షంగా ఆదితితో ప్రేమలో ఉన్నానని విషయాన్ని వెల్లడించాడు. ఒక బుల్లితెర షోకి విచ్చేసినప్పుడు.. యాంకర్ అతనికి ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. ‘‘జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ వేయాలననుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా?’’ అని ఆ యాంకర్ అడిగింది. అందుకు సిద్ధార్థ్ బదులిస్తూ.. ‘‘మీ ఊరిలో ఆదితి దేవో భవ అంటారు’’ అని చెప్పగానే.. షోలో ఉన్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు. అతడు ‘అతిథి’ స్థానంలో ‘ఆదితి’ అని చెప్పడంతో.. ఆమెతో ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయినా.. ఓపెన్‌గానే కలిసి తిరుగుతున్నప్పుడు, తమ డేటింగ్ వార్తలపై వీళ్లు ఎందుకు స్పందించడం లేదు? ఏమో, ఇందుకు సమాధానం ఆ ఇద్దరికే ఎరుక.