Bhatti Vikramarka : రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే పంచుతాం
- ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం. రాష్ట్ర వనరులు
- సంపద ప్రజలకే పంచుతామన్న భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని, ప్రజలు ఇచ్చే ప్రతి సూచన చాలా విలువైనదన్నారు భట్టి. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నిజమైన రైతుకి భరోసా ఉండాలన్నారు. రైతు కానీ వాళ్ళ వద్దని, గతంలో జరిగిన లోపాలు, జరిగిన ఆర్థిక నష్టం పై కూడా ఆలోచించాలన్నారు. రైతులకి ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. రైతు బంధు మీ ఖాతా లో వేశామని, రుణ మాఫీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. న్యాయమైన సహాయం రైతులకు అందివ్వాలి అన్న ఓపెన్ మైండ్ తో ప్రభుత్వం వుందని, బక్క , చిన్న కారు రైతులకి న్యాయం చేయాలి అన్న లక్ష్యం తో వున్నామన్నారు. పేపర్ లో మీడియా లో వచ్చేది ఏది నిజం కాదు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు ఎవ్వరూ అటువంటి వాటిని నమ్మవద్దన్నారు మంత్రి తుమ్మల.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఖర్చు పెట్టే ప్రతి రూపాయ ప్రజలదే అని, గత ప్రభుత్వం ఏ స్కీం ప్రజల అభిప్రాయం స్వీకరించ లేదన్నారు. నాలుగు గోడల మధ్య గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ప్రజల మీద రుద్దారని, ప్రతి పైసా కు అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత మాపై వుందన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు మంత్రి పొంగులేటి. 9 జిల్లాలో రైతు లు ప్రజలు, మెదవుల ఆలోచనలను తీసుకుంటాం రైతులను ఆదుకోవాలని ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేవాళ్లు మాట్లాడుతున్నారని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెడతాం… అది ప్రధాన ప్రతిపక్షం గమనించాలన్నారు మంత్రి పొంగులేటి.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!