NTV Telugu Site icon

Bhatti Vikramarka: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తాం..

Batti

Batti

కంచ గచ్చిబౌలి భూములపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సంయుక్త ప్రకటన చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని.. న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించవద్దని అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను మంత్రులు ఆదేశించారు.

Also Read:Ambati Rambabu: లోకేష్.. చంద్రబాబును మించిపోయాడు.. అంబటి హాట్‌ కామెంట్స్..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిలోకం నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Hcu.. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వెంటనే పనులన్నీ ఆపేయాలని.. హైకోర్ట్ రిజిస్టర్ ఇచ్చిన నివేదికలో చాలా కీలక అంశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.

Also Read:Ramanaidu Studio Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రామానాయుడు స్టూడియో భూ కేటాయింపు రద్దు..!

ప్రభుత్వం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వెయ్యాలని ఆదేశించింది. 6 నెల్లలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని సూచించింది. ఫారెస్ట్ ను నాశనం చేసే కార్యక్రమం జరుగుతోంది. చెట్లు.. నెమళ్ళు.. పక్షులు.. వన్య ప్రాణులు ఉన్నాయి. వంద ఎకరాలను ఎలా కొట్టేశారు. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.