మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రులను జైలుకు పంపినట్టే ఈదేశ సంపద ప్రజలకే పంచాలని పోరాడుతున్న రాహుల్ గాంధీని జైలుకు పంపాలని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, దేశ సంపద ప్రజలకు పంచాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఏమైనా నేరమా? అ ని ఆయన ప్రశ్నించారు. ఈ దేశ సంపదను దోచుకుని పారిపోయిన లలిత్ మోడీ, నిరవ్ మోడీ లకు ప్రధాని కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు. దోపిడిదారులను రక్షిస్తూ సంపదను పంచాలని ప్రశ్నిస్తున్న వారిపై మోడీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను ప్రధాని మోడీ క్యాపిటల్ లిస్టులకు దోచిపెట్టడం వల్ల ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడుగా తయారయ్యారు ఆదానీ అని, రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడమన్నారు భట్టి.
Also Read : Aditi Rao Hydari: మైమరుపా.. మెరుపా.. నిన్నిలా చూస్తే
దేశ సంపదను మోడీ క్రోనీ క్యాపిటల్ లిస్ట్ లకు దోచిపెడుతుంటే రాష్ట్ర సంపదను కేసిఆర్ తన మిత్రులైన బినామీలకు దారాదత్తం చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రజల ఆస్తి రాష్ట్ర సంపద అయిన సింగరేణి ని కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని, మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను లక్షన్నర ఉద్యోగాలు చేయాల్సిన ప్రభుత్వం ఉన్న కొలువులకి ఎసరు పెట్టడం అన్యాయమన్నారు. ప్రజల జీవన భృతి కోసం ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఈ పాలకులదేనని, సింగరేణి సంస్థలు కాపాడుకుంటనే ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. సింగరేణి సంస్థ మాది మన ఆస్తి అని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి రాష్ట్ర సంపద నిలబెడుతాం ప్రైవేటీకరణ రద్దు చేస్తామని, సింగరేణిలో ఉద్యోగాలు పెంచుతూ సింగరేణి వనరులను కాపాడుకుంటామన్నారు.