NTV Telugu Site icon

Bhatti Vikramarka : కేసీఆర్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. అయితే.. రేపు కేయు విద్యార్థులతో భట్టి విక్రమార్క భేటి కానున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం భట్టి పాదయాత్ర సాగుతోంది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో కారణం మీటింగ్‌లో భట్టి విక్రమార్కతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్ రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, స్వర్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని బీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, పెదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మరో సారి ఇందిరమ్మ పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Tamil Nadu Liquor Policy : సీఎం కీలక నిర్ణయం.. ఇక నుంచి అక్కడ కూడా మద్యంకు అనుమతి

అంతేకాకుండా.. ఉదయం ఆయన పాదయాత్రలో మాట్లాడుతూ.. బీసీలకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జనగణన చేయకుండా రెండు పార్టీలు నాటకం అడుతున్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ స్నేహభావంతో అందరిని కలుపుకొని పోయేలా చూసుకుంటూ వచ్చిందని.. ఇలా ప్రశాంతంగా ఉన్న భారతదేశంతో పాటు తెలంగాణలో అల్లకల్లోలం చేసేలా కుట్ర చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీ పార్టీకి లొంగిపోయారని ఆయన ఆరోపణలు చేశారు. అవినీతి పైనా చర్యలు తీసికుంటామని చెప్పిన బీజేపీ పెద్దలు అవినీతికి పాల్పడ్డ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు మధ్య లాలూచీ లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ పెద్దలు సూత్రధారులు అని.. బండి సంజయ్ లాంటి పాత్రధారులు అని ఆయన విమర్శించారు. ఈ ఆటలను సాగనివ్వమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read : Bandi Sanjay : పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’కు తరలిరండి