సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.
‘తొలిసారి సైంటిఫిక్‌గా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించాం. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని చట్టం చేసింది. బీఆర్ఎస్ తెచ్చిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటోంది. బీజీపీ నైజాం ఏమిటో దేశ ప్రజలకు తెలిసింది. ప్రధాన మంత్రి బీసీ రిజర్వేషన్పై కలిసేందుకు సమయం కూడా ఇవ్వడం లేదు. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశాం. రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు ఇస్తుంటే.. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది. బీజేపీ వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల న్యాయ స్థానాల్లో నిలిచిపోతుంది’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Also Read: Hanamkonda Crime: కూతురి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పోలీసులకు ఫోన్ చేసి..!
‘రాష్ట్రంలోని యావత్ ఓబీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీల బంద్ బీజీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్. బంద్‌లో అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. బిల్లు అమలు జరగకపోవడం రాష్ట్ర బీజేపీ ప్రజాల గుండెకోతగా మిగిలిపోయి ఉంది. బీజేపీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తే మేము మీ వెనుక నడుస్తాం. అడ్డగోలుగా బీజేపీ నాయకత్వం మాట్లాడుతుంది. బీసీ వర్గాలు అమాయకులు కాదు.. బీసీ రిజర్వేషన్లకు మిగిలిన వర్గాలు కుడా మద్దతు పలుకుతున్నాయి. బీజేపీ పార్టీకి వ్యతిరేకముగా బంద్ జరుగుతుంది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు అందరూ మద్దతు తెలపాలి’ అని భట్టి విక్రమార్క కోరారు.