Bharati Hollikeri : జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు. అయితే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. నవంబర్ 7 వ తేదీ లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు.
Also Read :Angelo Mathews Wicket: నా పదిహేనేళ్ల కెరీర్లో.. ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు: మాథ్యూస్
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి, డీపీఆర్ఓ కార్యాలయం నుండి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Also Read : Kaleru Venkatesh : అంబర్‌పేటలో బీజేపీ పతనానికి నాంది పలికారు
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?