భక్తి టీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా సాగిపోతోంది. అక్టోబర్ 31న ప్రారంభం అయిన కోటి దీపోత్సవ సంరంభం 11వ రోజుకి చేరుకుంది. కోటిదీపోత్సవం-2022 11వ రోజు ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలోకి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ఆహ్వానం పలికారు. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది..ప్రతి రోజూ భక్తులు మెచ్చేలా.. ఆధ్యాత్మిక వేత్తలకు నచ్చేలా విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.11వ రోజు కార్యక్రమాలకు అద్భుతంగా కొనసాగించింది. ఎన్ని వేలమంది వచ్చినా ఎక్కడా ఎలాంటి అపశృతికి తావులేకుండా సమర్థంగా ముందుకు నడిపిస్తోంది.
కార్తిక మాసాన దీపాలు వెలుగుతుంటే… ఎన్టీఆర్ స్టేడియం దేదీప్యమానంగా కనిపించింది. ఆధ్మాత్మిక శోభ అణువణువునా సాక్షాత్కరించింది. దగ్గరికి వచ్చి కూర్చుని దీపాలు వెలిగించలేని వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీలు వీక్షిస్తూ అనుభూతి చెందుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలయితే చాలు వాహనాలన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు పరుగులు పెడుతున్నాయి. పిల్లా పెద్దా, ఆడా మగా తేడాలేకుండా కోటి దీపోత్సవంలో పాలు పంచుకుంటున్నారు.
పద కొండవ రోజు త్రిదండి శ్రీ జయపతాక స్వామీజీ (ఇస్కాన్ వరల్డ్ హెడ్, మాయాపూర్, వెస్ట్ బెంగాల్), త్రిదండి శ్రీ భాను స్వామి మహరాజ్ (ఇస్కాన్, మేనేజ్‌మెంట్ హెడ్),మాతా నితాయి సేనాని (ఇస్కాన్, విశాఖపట్నం), శ్రీ సాంబదాస స్వామీజీ (ప్రెసిడెంట్ ఇస్కాన్, విశాఖపట్నం) అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనామృతం వినిపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.ఏసీబీ డీజీ అంజనీకుమార్ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు.
అన్నవరం సత్యదేవుని వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తులచే నిర్వహించారు. విష్ణుమూర్తి విగ్రహాలకు సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణోత్సవం కడు వైభవంగా జరిగింది. శేష వాహన సేవ నిర్వహించారు.సప్త హారతుల విశిష్టతను పండితులు వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటి దీపోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాయి ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ.. తరలి రండి.. ఈ కోటి దీపోత్సవంలో భాగస్వాములు కండి.. ఆ భగవంతుడి కృపకు పాత్రులు కండి. ప్రతి రోజూ ఆరుగంటలకు ప్రారంభం అయ్యే కోటిదీపకాంతుల్లో మీరూ వెలిగిపోండి.