NTV Telugu Site icon

Bhagwanth Khuba: కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

Bhagwanth Khuba

Bhagwanth Khuba

రామగుండంలోని ఎన్టీపీసీ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్న బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా పరిశీలించారు. బండి సంజయ్, భగవంత్ ఖుబాతోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్ సీఎల్) ను బండి సంజయ్, భగవంత్ ఖుబా సందర్శించారు.

Also Read :Students Missing: తిరుపతిలో కలకలం.. ఐదుగురు టెన్త్‌ విద్యార్థుల కిడ్నాప్..!

ఆర్ఎఫ్ సీఎల్ సందర్శన అనంతరం గోదావరిఖనిలోని ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్, భగవంత్ ఖుబాలు.. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఎస్.కుమార్ నివాసంలో ప్రధాని రామగుండం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబా మాట్లాడుతూ.. ఈ నెల 12 న ప్రధాని మోడీ చేతుల మీదగా రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం.. టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణలో ప్రజాదరణ తగ్గుతుందన్నారు.

Also Read : Gangula Kamalakar : ఈడీ, ఐటీ టార్గెట్‌ మంత్రి గంగులేనా..?

కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర వచ్చిన తరువాత కూడా తెలంగాణ ప్రజలు అందాల్సిన ఫలాలు అందడం లేదని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎగురవేయడం ఖాయమని ఆయన అన్నారు.