నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే ‘భగవంత్ కేసరి’. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది..బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో నే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన తరువాత చేయబోయే బాబీ సినిమా కూడా పక్కా మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది.
బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదలయి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.. దసరా సెలవులు ఉండడంతో ఈ చిత్రం వసూళ్లు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటసింహం నటించిన ‘భగవంత్ కేసరి’ 4 రోజుల్లో భారీగా వసూళ్లు సాధించింది.’భగవంత్ కేసరి సినిమా ‘కి నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో మొత్తం కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 67.35 కోట్లు బిజినెస్ జరిగింది.అయితే ‘భగవంత్ కేసరి’ చిత్రానికి నాలుగో రోజు అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 5.50 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 6.50 కోట్లు వరకూ రాబట్టింది. ఇక, ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా క్రాస్ చేసింది.దీంతో అక్కడ హ్యాట్రిక్ సాధించిన హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు.