NTV Telugu Site icon

Reels: రైలు లోపల, ట్రాక్‌లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ

Reels

Reels

రైళ్లు, రైల్వే ట్రాక్‌లు, రైల్వే స్టేషన్లలో రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంది రైల్వే బోర్డు. రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. రైల్వే ప్రాంగణంలో కోచ్‌లు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలకు రైల్వే బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రైల్వే భద్రతకు ముప్పు కలిగించే సెక్షన్ల కింద రీల్ చేసే వారిపై కేసు నమోదు చేస్తామని రైల్వే బోర్డు లేఖలో పేర్కొంది.

Winter: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు రైల్వే ట్రాక్‌ల వద్ద యాక్షన్ రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్‌పై రాయి లేదా ఏదైనా వస్తువు ఉంచి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అనుకోకుండా ట్రైన్స్ వస్తే తప్పించుకొనే ఛాన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వారితో పాటు రైల్వే ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిపై రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైలు లోపల లేదా రైలు పట్టాలపై రీల్స్ చేసే వ్యక్తులపై RPF కేసు నమోదు చేయనుంది. రీల్స్ చేసేవారు రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. కోచ్‌లు, రైల్వే ప్రాంగణంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది.

Amit Shah: మణిపూర్పై అమిత్ షా వరుసగా రెండో రోజు సమావేశం..

సోషల్ మీడియాలో కదులుతున్న రైళ్లు, రైల్వే ట్రాక్‌ల పక్కన చేసిన విన్యాసాల వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చేసి వైరల్‌గా మారి డబ్బు సంపాదించడం కోసం.. తమ ప్రాణాలతో పాటు వేలాది మంది రైల్వే ప్రయాణికుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని అరికట్టేందుకు రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.