Reels: రైలు లోపల, ట్రాక్‌లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
- దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లకు రైల్వే బోర్డు కఠిన ఆదేశం
- రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేస్తే జైలుకు
- అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైళ్లు, రైల్వే ట్రాక్‌లు, రైల్వే స్టేషన్లలో రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంది రైల్వే బోర్డు. రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. రైల్వే ప్రాంగణంలో కోచ్‌లు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలకు రైల్వే బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రైల్వే భద్రతకు ముప్పు కలిగించే సెక్షన్ల కింద రీల్ చేసే వారిపై కేసు నమోదు చేస్తామని రైల్వే బోర్డు లేఖలో పేర్కొంది.
Winter: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి!
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు రైల్వే ట్రాక్‌ల వద్ద యాక్షన్ రీల్స్ చేసేందుకు రైల్వే ట్రాక్‌పై రాయి లేదా ఏదైనా వస్తువు ఉంచి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అనుకోకుండా ట్రైన్స్ వస్తే తప్పించుకొనే ఛాన్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వారితో పాటు రైల్వే ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిపై రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుంది. రైలు లోపల లేదా రైలు పట్టాలపై రీల్స్ చేసే వ్యక్తులపై RPF కేసు నమోదు చేయనుంది. రీల్స్ చేసేవారు రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే.. కోచ్‌లు, రైల్వే ప్రాంగణంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది.
Amit Shah: మణిపూర్పై అమిత్ షా వరుసగా రెండో రోజు సమావేశం..
సోషల్ మీడియాలో కదులుతున్న రైళ్లు, రైల్వే ట్రాక్‌ల పక్కన చేసిన విన్యాసాల వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చేసి వైరల్‌గా మారి డబ్బు సంపాదించడం కోసం.. తమ ప్రాణాలతో పాటు వేలాది మంది రైల్వే ప్రయాణికుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని అరికట్టేందుకు రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!