NTV Telugu Site icon

Xiaomi: అమెజాన్‌లో బెస్ట్ డీల్.. రూ.6,999 కే స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..

New Project (17)

New Project (17)

ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి. కాని కొందరికీ స్మార్ట్ ఫోన్ కొనడం భారంగా ఉండొచ్చు. అందరూ వేల రూపాయలు ఖర్చు చేసి ఫోన్లు కొనలేరు. అయితే అలాంటి వారికి ఫేమస్ మొబైల్ బ్రాండ్ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7 వేల కంటే తక్కువ ధరకే అందిస్తోంది. దాని గురించి తెలుసుకుందాం.

READ MORE: INDIA: భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని అమెరికా మత స్వేచ్ఛ నివేదిక వెల్లడి.. తిరస్కరించిన భారత్

Redmi A3 స్మార్ట్ ఫోన్ ని వినియోగదారులు రూ.9,999 MRP ధరకు బదులుగా రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ అమెజాన్‌లో అందించబడుతోంది. అంటే Redmi A3 స్మార్ట్ ఫోన్ పై 30 శాతం తగ్గింపు తర్వాత వినియోగదారులకు రూ.3000 తగ్గింపు ఇస్తున్నారు. ఈ ధరతో వినియోగదారులు ఫోన్ 3GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.6,600 తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే గరిష్ట తగ్గింపు కోసం ఫోన్ మంచి స్థితిలో ఉండటం అవసరం. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి నలుపు, ఆకుపచ్చ రంగు ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. Redmi A3 ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ Android 13లో రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71 అంగుళాల HD+ (1,600×700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio G36 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా, ఇది 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 8MP ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.