Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో లభించే ఫోన్స్ ఇదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget Smartphones: ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు తిండి, నీరు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అన్నట్లుగా సాగుతోంది. ఉదయం లేవగానే పడుకునే వరకు ఈ మొబైల్ వాడకం ప్రతి మనిషిలో కామన్ గా మారిపోయింది. మరి ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నా, బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా వారికీ ఈ ఫోన్స్ ఉపయోగపడవచ్చు. 6000 mah భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న అత్యుత్తమ బడ్జెట్ 5G ఫోన్లను కేవలం రూ.15,000 లోపు ధరతో పొందవచ్చు. మరి ఆ ఫోన్స్ వివరాలేంటో ఒకసారి చూద్దామా..
Also Read
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
iQOO Z9x 5G:
ఈ మిడ్-సెగ్మెంట్ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఉంది. స్నాప్ డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50MP AI ప్రాథమిక కెమెరా, 2MP సెన్సార్ ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ రూ.11,999కు అందుబాటులో ఉంది.
Vivo T3x 5G:
ఈ వివో బడ్జెట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో వస్తోంది. 6000mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.12,088 గా ఉంది. ఇక కెమెరా పరంగా 50MP + 2MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
Read Also: Beerla Ilaiah: నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ పై ఐలయ్య ఫైర్..!
Samsung Galaxy M15 5G:
ఈ శాంసంగ్ ఫోన్ అమెజాన్‌లో రూ.11,999కే లభిస్తుంది. 6000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ చార్జింగ్‌కి మద్దతు ఉంది. ఈ ఫోన్ Dimensity 6100+ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP + 5MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో), 13MP ఫ్రంట్ కెమెరా కలదు.
Motorola G64 5G:
మోటోరోలా నుండి వచ్చిన ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఇందులో MediaTek Dimensity 7025 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 OS. ఫోటోగ్రఫీకి 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్లిప్ కార్ట్ లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.
Samsung Galaxy M35 5G:
ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,490కి లభిస్తోంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ చార్జింగ్‌కి మద్దతు ఉంది. ఇందులో Exynos 1380 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఫోన్‌లో 50MP ప్రాథమిక కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 14పై One UI 6 సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది.
ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి పనితీరుతో కూడిన ఈ ఫోన్లు మీకు సరైన ఎంపిక. బడ్జెట్‌లో అత్యుత్తమ ఫీచర్లు కావాలంటే, పై ఫోన్లను ఒకసారి పరిశీలించండి. మంచి ఫోన్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్స్.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!