Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electricity Meter Red Light Blinking: కొన్ని సార్లు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంటుంది.. కరెంట్ వినియోగం ఎక్కువ లేకపోయినా.. బిల్లు మాత్రం వాచిపోతుంది.. అయితే, ఇంట్లో విద్యుత్ మీటర్‌ను గమనించినప్పుడు ఒక ఎర్రటి లైట్ నిరంతరం మినుకుమినుకుమంటూ కనిపిస్తుంది. అయితే, ఈ లైట్ కేవలం సూచిక మాత్రమే కాదు. అది మినుకుమినుకుమనే వేగాన్ని గమనించడం ద్వారా ఇంట్లో విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో ఉందో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మీటర్‌లోని ఈ సూచికను నిర్లక్ష్యం చేస్తే, విద్యుత్ వినియోగానికి సంబంధించిన సమస్యలను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు.
విద్యుత్ మీటర్లలో పలు చిన్న లైట్లు, సూచికలు ఉంటాయి. వీటిలో కొన్ని విద్యుత్ వినియోగాన్ని, మరికొన్ని లోడ్, లీకేజ్ లేదా మీటర్‌కు సంబంధించిన ఇతర పరిస్థితులను సూచిస్తాయి. వీటిలో ఎర్రటి LED లైట్ ప్రత్యేకంగా విద్యుత్ వినియోగానికి సంబంధించిన పల్స్ సూచికగా పనిచేస్తుంది. సాధారణంగా ఇంట్లో విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నప్పుడు ఈ లైట్ నెమ్మదిగా మినుకుమినుకుమంటుంది. అదే సమయంలో హీటర్, గీజర్, ఏసీ వంటి అధిక విద్యుత్ వినియోగించే పరికరాలు పనిచేస్తున్నప్పుడు మీటర్లో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఎర్ర LED వేగంగా మినుకుమినుకుమంటుంది. అంటే ఆ సమయంలో ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతోందని అర్థం.
Also Read
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
అయితే ఇంట్లో అధిక విద్యుత్ వినియోగించే పరికరాలేవీ పనిచేయకపోయినా ఎర్ర లైట్ వేగంగా, నిరంతరం మినుకుమినుకుమంటుంటే మాత్రం పరిస్థితిని పరిశీలించాలి. ఇంట్లోని అన్ని విద్యుత్ ఉపకరణాలను ఆపివేసి, మెయిన్ MCBని ఆన్‌లో ఉంచిన తర్వాత కూడా మీటర్ వేగంగా పల్స్ అవుతుందా, యూనిట్లు పెరుగుతున్నాయా అనేది గమనించవచ్చు. భారీ లోడ్ ఉన్న పరికరాలు ఏవీ పనిచేయకపోయినా యూనిట్లు వేగంగా పెరుగుతూ ఉంటే, వైరింగ్‌లో లీకేజ్, మీటర్‌కు సంబంధించిన సమస్య లేదా ఇతర సాంకేతిక లోపం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా మీటర్‌ను తెరవడం లేదా వైరింగ్‌లో మార్పులు చేయడం కాకుండా సంబంధిత విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసి, అర్హత కలిగిన సాంకేతిక సిబ్బందితో తనిఖీ చేయించుకోవడం మంచిది. ఎర్ర లైట్ మినుకుమినుకుమనే వేగాన్ని మాత్రమే చూసి మీటర్లో లోపం ఉందని ఖచ్చితంగా నిర్ధారించలేం. మీటర్‌లోని పల్స్ రేట్, కనెక్ట్ చేసిన లోడ్, ఇతర విద్యుత్ వినియోగ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అనుమానాస్పదంగా వినియోగం పెరుగుతున్నట్లు కనిపిస్తే సకాలంలో తనిఖీ చేయించుకోవడం ద్వారా అనవసరమైన విద్యుత్ ఖర్చును నివారించవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!