NTV Telugu Site icon

Rishab Shetty : ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మాడు.. ఇప్పుడు జాతీయ అవార్డ్ అందుకున్నాడు

New Project (36)

New Project (36)

Rishab Shetty : ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమాతో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఆ సినిమా చూసిన వారెవరైనా ఈ అవార్డుకు ఆయన అర్హుడే అని ప్రశంసిస్తారు. ఆ నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. రిషబ్ శెట్టికు ఈ సక్సెస్ అంత ఈజీగా ఏం దక్కలేదు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మారు. ఒకప్పుడు అప్పు ఇచ్చినవాళ్లు ఎక్కడ గొడవ చేస్తారో అని మారువేషాల్లో తిరిగారు.

Read Also:Meghalaya: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

రిషబ్ శెట్టి కర్ణాటక రాష్ట్రంలోని కెరాడి అనే పల్లెటూర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. డిగ్రీ పూర్తి కాకముందే ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకూడదని భావించి మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టారు. మొదట సైనైడ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత గండ హెండతి సినిమాకు క్లాప్ బాయ్ గా చేరారు. ఆ సినిమాకు ఏడాది పని చేస్తే రిషబ్ కు కేవలం 1500 రూపాయలు వేతనంగా దక్కింది. కిరిక్ పార్టీ అనే సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నారు రిషబ్ శెట్టి. ఆ తర్వాత వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాల్లో నటిస్తూ రిషబ్ శెట్టి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం కాంతారా 2 సినిమాతో బిజీగా ఉన్న ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను, అవార్డులను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also:Bank Manager Fraud: 26 కిలోల బంగారంతో ఉడాయించిన బ్యాంకు మేనేజర్..

Show comments