IPL 2024: బెంగళూరు మ్యాచ్‌లకు నీటి కష్టాలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BWSSB To Supply Treated Water To IPL 2024 Matches in Chinnaswamy Stadium: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. త్రాగు నీటి కోసం కూడా క్యూ లైన్లో గంటల కొద్ది నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బెంగళూరులో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లకు నీటి కష్టాలు తప్పడం లేదు.
బెంగళూరు నగరంలోని ప్రజల అవసరాలకే నీరు లభించని వేళ.. ఐపీఎల్ 2024లో భాగంగా నిర్వహించే ఒక్కో మ్యాచ్‌కు 75,000 లీటర్ల నీటి అవసరం ఉంది. నీటి కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విన్నపంపై బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక నిర్ణయం తీసుకొంది. వేస్ట్ వాటర్‌ను శుద్ధి చేసి.. చిన్నస్వామి స్టేడియంకు సరఫరా చేయాలని బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనున్నారు.
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్
బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఛైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2024 మ్యాచ్‌లకు శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నాం. కావేరీ నది, భూగర్భ జలాలను అస్సలు వాడటం లేదు’ అని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నగరంలో భారీగా నిర్మాణాలు పెరగడంతో.. నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోయాయి. దాంతో బెంగళూరులో నీటి సమస్య పెరిగింది.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!