Bengaluru Murder Case: మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం.. 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..
- మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం..
- 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..
- పోలీసులు పట్టుకోవడానికి ముందే సూసైడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మి(29) హత్య కేసులో సంచలనం నెలకొంది. ఈ హత్యలో కీలక నిందితుడిగా భావిస్తున్న సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ బుధవారం ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం బెంగళూర్ నుంచి ఒడిశాకు పారిపోయాడు. విచారణలో భాగంగా రాయ్‌ని పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు ఒడిశాకు వెళ్లారు. అయితే, వారు అతడిని అదుపులోకి తీసుకునే ముందే రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందు రోజు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. నిందితుడు వేరే రాష్ట్రానికి చెందిన వాడని, అతడిని పట్టుకునే పనిలోనే ఉన్నామని చెప్పారు. ఒడిశాలో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూర్ నుంచి పోలీస్ టీంలు వెళ్లాయి. మూడు నుంచి నాలుగు పోలీస్ బృందాలు ఒడిశాకు వెళ్లినప్పటి నుంచి నిందితుడు తన స్థలాలను మారుస్తూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగూ పోలీసులకు చిక్కుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
Read Also: Bengaluru Murder Case: మహాలక్ష్మి హత్య కేసులో సంచలనం.. 59 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య..
ముక్తి రంజన్ మంగళవారం సొంతూరు ఒడిశాలోని భద్రక్ జిల్లా ఫండి గ్రామానికి వచ్చాడు. గత రాత్రి ఇంటి నుంచి స్కూటర్‌పై బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం కూలేపాడు శ్మశాన వాటిక సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ల్యాప్ టాప్ స్కూటర్‌లోనే ఉండిపోయింది. ఘటన జరిగిన ప్రాంతం దుషిరి పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వస్తుంది.
సెప్టెంబర్ 22న మహాలక్ష్మీ తన నివాసంలో అత్యంత దారుణంగా హత్య చేయబడింది. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి, 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మహాలక్ష్మీకి హేమంత్ దాస్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే, హేమంత్ దాస్ తన భార్యకు అష్రాఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అతడి పైనే అనుమానం ఉందంటూ ఆరోపించాడు. తాజాగా విచారణలో మహాలక్ష్మీతో పనిచేసే ముక్తి రంజన్ రాయ్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. తీరా అతడిని పట్టుకునేలోపే ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!