Site icon NTV Telugu

Bengaluru: ఎక్ట్రా కప్పు ఇవ్వనందుకు కాఫీ షాప్ సిబ్బందిని చితకబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Bengaluru

Bengaluru

ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: HYDRA: నాలాలు పొంగొద్దు.. వ‌ర‌ద ముంచెత్తొద్దు

బాధితుడి కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్‌కు వచ్చారు. ఒక కప్పు కాఫీ కొన్నారు. అదనంగా మరో ఖాళీ కప్పు కావాలని అడిగారు. ఉద్యోగి మర్యాదగా నిరాకరించి, మరో కప్పు కాఫీ కొనమని కోరాడు. దీంతో ఆ కస్టమర్లు ఉద్యోగిపై దుర్భాషలాడారు. అందులో ఓ కస్టమర్ ఉద్యోగిని తల, ముఖంపై కొట్టి, కడుపులో తన్నాడు. మిగతా వ్యక్తులు కూడా బాధితుడిపై ఘోరంగా దాడి చేశారు. కాఫీ షాపులో ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని శాంతింపజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీని చూసిన నెటిజన్లు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version