ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.