NTV Telugu Site icon

Crime News: ప్రేమ వద్దు అన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య

Bengal Crime

Bengal Crime

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. అబ్బాయి ఆ అమ్మాయితో కొన్ని రోజులుగా స్నేహం చేస్తుంది. కాగా.. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయట పడింది. తన కుమార్తె తన స్నేహితుడితో కలిసి తన భార్యను హత్య చేసిందని 14 ఏళ్ల బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: AP Home Minister: ఏపీలో పోలీసులకు వీక్ ఆఫ్లు.. కొనసాగుతున్న సన్నాహాలు..?

కేసు పెడితే చంపేస్తామని మైనర్లిద్దరూ బెదిరించారని నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేశానని తండ్రి చెప్పాడు. సోషల్ మీడియాలో పరిచయమైన అబ్బాయితో తన కుమార్తెకు ఏడాదిన్నరగా సంబంధం ఉందని తండ్రి తెలిపాడు. అయితే, తల్లి తరచూ తన కూతురిని ఇదే విషయమై తిట్టేదని, ఆమె అతనితో స్నేహం వద్దు.. వదులోకోవాలని సూచించేది.. కానీ తన కూతురు అందుకు అంగీకరించలేదని చెప్పాడు.

Read Also: Charu Haasan: ఆసుపత్రిలో కమల్ సోదరుడు.. అసలు ఏమైందంటే?

దీంతో బాలిక తల్లిని హత్య చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక జూన్ 6వ తేదీ రాత్రి తన ప్రియుడిని తన ఇంటికి పిలిపించింది. బాలుడు ఆమె తల్లిని గొంతు నులిమి.. ఛాతీపై కొట్టి చంపాడు. శబ్దం విని మేల్కొన్న తండ్రి.. యువకుడు అతన్ని మంచం మీద నుండి తోసేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తన భార్య మరణాన్ని సహజ మరణమని పేర్కొంటూ మధ్యాహ్నం ఆమెను దహనం చేశాడని సదరు వ్యక్తి తెలిపాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు మైనర్లను అరెస్టు చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. దీంతో.. వారిద్దరూ నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Show comments