Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న అత్యంత కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున స్టోక్స్ ఈ బాంబ్ పేల్చాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) టీ విరామానికి సరిగ్గా 15 నిమిషాల ముందు ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసిన సమయంలో.. 35 ఏళ్ల స్టోక్స్ మైదానంలో జట్టు కోసం తీవ్రంగా బౌలింగ్ చేస్తూ శ్రమిస్తుండటం గమనార్హం. అయితే, ఈ రిటైర్మెంట్ వెనుక అనేక అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే (ECB) బలవంతంగా స్టోక్స్‌ను రిటైర్ అయ్యేలా చేసిందా? అనే చర్చ ఊపందుకుంది. ఈ అనుమానాలకు ఒక బలమైన కారణం కూడా ఉంది. లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ విజయం తర్వాత నైట్‌క్లబ్ వివాదం విషయంలో క్రమశిక్షణా రాహిత్యం కింద స్టోక్స్‌ను లండన్ ది ఓవల్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి పక్కనబెట్టారు. దీనిపై ఈసీబీ, క్రికెట్ రెగ్యులేటర్ విచారణ కూడా జరిపాయి. ఆ తర్వాత అతను ఎలాంటి తప్పు చేయలేదని తేలడంతో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌కు మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. కానీ, బోర్డు అతడిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని, అందుకే స్టోక్స్ అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు జోరందుకున్నాయి.
ఈ వివాదాలపై స్కై స్పోర్ట్స్‌తో బెన్ స్టోక్స్ స్పందించాడు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమైనదని, బోర్డు ఒత్తిడి ఉందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. ఓవల్ టెస్ట్‌కు దూరం కావడం కానీ, క్రమశిక్షణా చర్యలు కానీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకడానికి ప్రధాన కారణం కాదన్నాడు. ఈ రిటైర్మెంట్ ఆలోచనల వెనుక ఉన్న అసలు కారణాలు గత వింటర్ సీజన్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన 4-1 యాషెస్ ఓటమి సమయం నుంచే మొదలయ్యాయని వెల్లడించాడు. “లార్డ్స్ టెస్ట్ ముగిసిన తర్వాత నా కెరీర్ ఏ స్థితిలో ఉందనే దానిపై నాలో కొన్ని ప్రతికూల ఆలోచనలు మొదలయ్యాయి. అంతా సవ్యంగా చేయడానికే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి విపరీతంగా శ్రమించాను, కానీ ఆ ప్రయత్నంలో మానసికంగా పూర్తిగా అలసిపోయాను (Burned out)” అని స్టోక్స్ పేర్కొన్నాడు. బోర్డు తనను బలవంతం చేయలేదని చెబుతూనే, ఇటీవల నైట్‌క్లబ్ వివాదం, దాని చుట్టూ జరిగిన మీడియా రచ్చ.. ఇప్పటికే లోపల రగులుతున్న మంటకు మరింత నెయ్యి పోసినట్లు అయిందని స్టోక్స్ అంగీకరించాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి తనను పక్కనబెట్టడమే తన జీవితంలో తదుపరి ఏం చేయాలనే దానికి పూర్తి స్పష్టతనిచ్చిందని స్టోక్స్ చెప్పాడు. ఇంగ్లండ్ జట్టుకు దూరమై తన కౌంటీ జట్టు ‘డర్హామ్’ తరఫున ఆడుతున్నప్పుడు.. అంతర్జాతీయ క్రికెట్ ఇచ్చే ఊపిరాడని ఒత్తిడి నుంచి తనకు ఒక్కసారిగా విముక్తి లభించినట్లు అనిపించిందని, ఆ సమయంలో ఆటపై మళ్లీ కొత్త ఇష్టం కలిగిందని ఒప్పుకున్నాడు. కానీ తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌లోకి రాగానే ఆ అనుభూతిని పొందలేకపోయానని, కొన్ని క్షణాలు చాలా భారంగా అనిపించాయని చెప్పాడు.
Also Read
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
- Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
తాజావార్తలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!