Lok Sabha Elections2024: జైలులో ఉండి ఎంపీలుగా విజయం.. ప్రమాణ స్వీకారం పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఇద్దరు వ్యక్తులే.. జమ్మూ కాశ్మీర్‌లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను రెండుసార్లు ఓడించిన రషీద్ షేక్, ఖలిస్థానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్. జైలులో ఉన్న అభ్యర్థులు ప్రమాణం ఎలా చేస్తారు? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. జైలులో ఉన్న అమృత్ పాల్, షేక్ అబ్దుల్ రషీద్ ప్రమాణ స్వీకారం చేసేందుకు పార్లమెంట్ కు రావాల్సి ఉంటుంది. దీని కోసం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. వీరిని ప్రత్యేక భద్రత నడుమ పార్లమెంట్ కు తీసుకొస్తారు. అక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం తిరిగి జైలుకి తీసుకెళ్తారు. దోషులుగా తేలి, రెండెళ్ల జైలులో ఉంటే వీరిపై అనర్హత వేటు పడుతుంది.
READ MORE: NEET UG 2024: నీట్ లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజస్థాన్ అమ్మాయి..ఏం చెప్పిందంటే?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి రషీద్ షేక్ విజయం సాధించారు. రషీద్ షేక్ అలియాస్ ఇంజనీర్ రషీద్ బారాముల్లా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ స్థానంలో ఆయనకు మొత్తం 4 లక్షల 69 వేల 574 ఓట్లు వచ్చాయి. రషీద్ తన ప్రత్యర్థి ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షల 32 వేల 73 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు 2 లక్షల 66 వేల 301 ఓట్లు వచ్చాయి. ఒమర్ అబ్దుల్లా తన ఓటమిని అంగీకరించారు. రషీద్ షేక్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అతను జైలులో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన రషీద్ టెర్రర్ ఫండింగ్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. యూఏపీఏ చట్టం కింద తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రషీద్ షేక్ జైలులో ఉండగా.. ఆయన ఇద్దరు కుమారులు ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.
READ MORE: OnePlus 12 Glacial White: మార్కెట్లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ తెలుసుకుందామా..
మరో స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇతడు రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్థానీ అనుకూల గ్రూప్ ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ దాదాపు లక్షా 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అమృతపాల్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం అసోం జైలులో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్‌ను అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ జైలులో ఉండగానే పెద్ద విజయం సాధించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!