మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోటపల్లి మండలంలో తేనెటీగల దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దహన సంస్కారాలకు వెళ్లిన బృందంపై తేనెటీగలు దాడి చేయగా ఒకరు మృతి చెందగా మరికొంత మందికి గాయాలయ్ల్యాయి. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత(70)అనే మహిళ మృతి చెందగా ఆమెకు దహన సంస్కారాలు నిమిత్తం వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మండలంలోని పాత దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
Read Also:MLC Kavitha : నేత వృత్తి వ్యాపారం కాదు.. దేశ వారసత్వ కళాసంపద
తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో చంద్రకాంత మృతదేహానికి దహన సంస్కారాలు చేయకుండానే పారిపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తేనెటీగలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల ఎవరూ కూడా అటు వైపు వెళ్ళడానికి సాహసం చేయడం లేదు. తేనెటీగల దాడిలో గాయపడ్డ ఇద్దరిని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం హెల్మెట్ పెట్టుకొని వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు
Read Also: Fighter Jet Crashes: ఇంటిపై కుప్పకూలిన యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి