Maruthi: అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ మారుతి, ఎస్ కే ఎన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తడి నీలి చీరలో నభా నటేష్ గ్లామర్ మాయాజాలం
ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘మా ప్రతీ సినిమా ఆడిందంటే దానికి కారణం ఎస్కేఎన్. ‘ఈరోజుల్లో’ మూవీకి ఎస్ కే ఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ సపోర్ట్ చేశారు. ఆ రోజు వాళ్లిద్దరూ లేకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఇలా ఉండేవాడ్ని కాదు. సుబ్బు మాకు ఎప్పుడూ క్రైమ్ కథలు చెబుతుండేవారు. కానీ ఓ పాయింట్‌ను సుబ్బు చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది. కానీ మా గ్రూపులో మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆ ఫాదర్ ఫీలింగ్‌ను పేపర్ మీద పెట్టారని నాకు అనిపించింది. మేం చెప్పిన మార్పులు, చేర్పులతో ఆ కథను మాకు సుబ్బు ఇచ్చేశాడు. అప్పటికే సాయి బాధల్లో ఉన్నాడు. అందుకే పిలిచి ఈ కథను ఇచ్చాను. సాయి కుమార్ మంచి విజువల్స్ ఇచ్చారు. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మదర్ కారెక్టర్‌లో వాసుకి జీవించారు. వాసుకి, నరేష్ చేసిన పర్ఫామెన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు ఎమోషనల్ అయ్యారు. ఒరిస్సా నుంచి వచ్చిన నీలఖి అద్భుతంగా నటించారు. సినిమా చూసిన తరువాత హీరో హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారు. అంకిత్ మంచి యాక్టర్ అని మరోసారి రుజువు అవుతుంది.
Post Office Savings Schemes: అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్స్ టాప్ స్కీమ్స్ ఇవే..!
సినిమాలో దమ్ముంది కాబట్టే.. ఈ రోజు ఇక్కడ మేం ఇలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. ‘బ్యూటీ’ చాలా గొప్ప సినిమా. ప్రతీ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ఆడపిల్లల గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలతో, యథార్ఘ సంఘటనలతో ‘బ్యూటీ’ కథను రాశారు. సెప్టెంబర్ 19న థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.