Bear Attack: జూపార్క్‌లో ఎలుగుబంటి దాడి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bear Attack: విశాఖపట్నంలోని జూపార్క్‌లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తెర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడి చేయడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్రగాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు. జూలో సిబ్బందికి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు. ఆరిలోవ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Train Accident: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 3 ఏనుగులు మృత్యువాత
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
జూపార్క్ ఎలుగుబంటి దాడిలో చనిపోయిన యానిమల్ కీపర్ కుటుంబానికి 10లక్షలు పరిహారాన్ని అటవీశాఖ ప్రకటించింది. రెండేళ్లుగా జూ పార్క్‌లో అవుట్ సోర్సింగ్‌లో మృతుడు నగేష్ పని చేస్తున్నట్లు తెలిసింది. జూ క్యూరేటర్ నందనీ సలారియా ఈ సంఘటన వివరాలను వెల్లడించారు. జూ క్యూరేటర్ నందనీ సలారియా మాట్లాడుతూ.. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్‌క్లోజర్ వద్ద క్లీనింగ్‌కు వెళ్ళాడు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్‌క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్నాడు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళినవెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసింది. నగేష్ మృతి మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అటవీ శాఖ తరపున 10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందిస్తున్నాం.” అని జూ క్యూరేటర్ నందనీ సలారియా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్‌నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!