తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలల్లో ఒకటి చిక్కుడు.. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.ఈ మధ్య ఎక్కువగా రైతులు వీటిని పండించాడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగులను అరికట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు..
మార్కెట్ లో ఏడాది పొడవున ఈ కాయలకు డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ముఖ్యంగా తెలంగాణాలోని పలు జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు మొలక దశనుండి కోత దశవరకు వచ్చే అవకాశం ఉంది… అందుకే ఈ తెగుళ్ల ను వెంటనే గుర్తించి చర్యలు చేపట్టం మంచిదని వ్యవసాయ నిపుణులు సలహా ఇస్తున్నారు..
సాధారణంగా ఈ తెగులు ఒక మొక్కనుండి మరోమెక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి, మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారముంటుంది.. ఈ మధ్యకాలంలో నాణ్యమైన విత్తనోత్పత్తికై సోయా చిక్కుడు సాగు రబీకాలంలో చేపట్టడం జరుగుతున్నది. పూత, కాయదశలో సోయా చిక్కుడులో ప్రధానంగా ఆశించే తెగుళ్ళును చూసినట్లయితే, సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు, ఆంత్రక్నోస్ ఆకుమచ్చ తెగులు మరియు మొవ్వ కుళ్ళు తెగులు ముఖ్యమైనది.. తెగుళ్లను సకాలం లో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు..