Apple : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరం అవుతుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది నిపుణులే కాదు పెద్దలు కూడా పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేస్తారు. రోజూ యాపిల్ తింటే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో పిల్లలను కూడా యాపిల్ తినేలా చేస్తున్నారు. అనారోగ్య సమస్యలున్నప్పుడు కూడా యాపిల్స్ ఎక్కువగా తినమని వైద్యులు చెబుతుంటారు. చాలా మంది పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి యాపిల్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు. యాపిల్స్ ఎక్కువ ధరలో ఉన్నప్పటికీ, దాదాపు అన్నింటిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read Also:RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గుర్తింపు.. ఆ విషయంలో సెకండ్ ప్లేస్
కానీ యాపిల్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, అయితే పొరపాటున దాని గింజలను తింటే అంతే ప్రమాదం ఉందని వైద్యులు వివరిస్తున్నారు. యాపిల్ గింజలను పొరపాటున తింటే ప్రమాదం ఏమిటి? చూద్దాం ఏం జరుగుతుందో. యాపిల్‌లోని గింజల్లో విషపూరితమైన సైనైడ్ ఉంటుంది. యాపిల్‌లో ఒకటి లేదా రెండు గింజలు తింటే ఫర్వాలేదు కానీ అంతకు మించి మన శరీరంలోకి వెళ్లడం వల్ల ప్రాణాపాయం తప్పదని నిపుణులు చెబుతున్నారు.
Read Also:Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి, 25 మందికి గాయాలు..
ఒక సర్వే ప్రకారం, 60 కిలోల బరువున్న 40 ఏళ్ల వ్యక్తి 150 నుండి 175 ఆపిల్ గింజలు తినడం వల్ల మరణించాడు. పదేళ్లలోపు పిల్లలు కనీసం 50 ఏళ్లలోపు గింజలు తింటే చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు యాపిల్ తినిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు యాపిల్స్ ఇస్తే విత్తనాలు లేకుండా ఉండాలి. అలా కాకుండా ఆలోచిస్తే భవిష్యత్తులో పిల్లలకు ఎన్నో ప్రమాదాలు చూడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.