Devajit Saikia: వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన బీసీసీఐ.. కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devajit Saikia: దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఊపేసింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే, ఈ సూపర్ ఓవర్లో శ్రీలంక నిర్దేశించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. భారత్-ఎ జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో ఈ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ వరుసగా రెండో ఓటమిగా కూడగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడైన విశేన్ హలంబెజ్ను నెట్టి వేయడంపై దుమారం రేగుతోంది.
ఆటపైనే మా దృష్టి..
ఇక,ఈ ఘటనతో సూర్యవంశీపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందేమోనని, అతడిని మందలించే అవకాశం ఉందంటూ క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు రేగాయి. కానీ, ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. వైభవ్‌పై చర్యలు తీసుకుంటారన్న ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేశారు. తమ ఆటగాళ్లు ప్రస్తుతానికి కేవలం టోర్నమెంట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని తాము కోరుకుంటున్నామని, ఇలాంటి బాహ్య పరమైన వివాదాల వల్ల వారి దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతో ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో ఈ యువ ఆటగాడిపై ప్రస్తుతానికైతే బీసీసీఐ చర్యలేమీ ఉండకపోవచ్చని స్పష్టమైంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
మరోవైపు.. క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య భౌతిక దాడులు లేదా నెట్టివేతలను ఐసీసీ (ICC) తీవ్రంగా పరిగణిస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.12 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు, మ్యాచ్ రెఫరీ లేదా ప్రేక్షకులతో సహా ఎవరితోనైనా అనుచితంగా భౌతిక సంబంధాన్ని (ఫిజికల్ కాంటాక్ట్) కలిగి ఉండటం నిషిద్ధం. ఆటగాళ్లు కావాలని లేదా అజాగ్రత్తగా ఇతర ఆటగాళ్లను, అంపైర్లను ఢీకొట్టడం, భుజాలతో నెట్టడం వంటివి ఈ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు సదరు ప్రవర్తన ఎంత తీవ్రమైనదో అంచనా వేయడానికి ఐసీసీ కొన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఆ తోపులాట ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అజాగ్రత్త వల్ల జరిగిందా? అనే విషయాలను పరిశీలించనుంది.
అసలు ఏం జరిగింది?
భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ ముగిసిన తరువాత అసలు డ్రామా మొదలైంది. లంక ఆటగాళ్లు తమ విజయాన్ని తీవ్రమైన ఉత్సాహంతో, పెద్ద పెట్టున అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఓటమి భారంతో తన బ్యాటింగ్ పార్ట్నర్ సూర్యాంశ్ షెడ్గేతో కలిసి పెవిలియన్ వైపు అడుగులు వేస్తున్న వైభవ్ సూర్యవంశీకి లంక ఆటగాళ్ల అతి ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఆగ్రహంతో వెనక్కి తిరిగిన సూర్యవంశీ, లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. కోపంలో ఒక శ్రీలంక ప్లేయర్‌ను భౌతికంగా వెనక్కి నెట్టేశాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మిగిలిన శ్రీలంక క్రికెటర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమనిగింది. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తాడని ఆశించిన సూర్యవంశీ.. ఈ సిరీస్‌లో పెద్ద స్కోర్లు సాధించ లేకపోయాడు. ఆ నిరాశకు తోడు లంక ఆటగాళ్ల స్లెడ్జింగ్ తోడవడంతో మైదానంలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!