BCCI Naman Awards: లెజెండ్స్‌కు బీసీసీఐ సలాం! రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు అత్యున్నత పురస్కారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Naman Awards: భారత క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేసిన దిగ్గజాలకు బీసీసీఐ అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఫాస్ట్ బౌలర్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీలను ఈ ఏడాది ప్రతిష్టాత్మక కల్నల్ సి.కె.నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (Life-time Achievement Award) వరించింది. అలాగే మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కు బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు.
READ ALSO: Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
దిగ్గజాల ప్రస్థానం ఇదే..
రాహుల్ ద్రవిడ్: అంతర్జాతీయ క్రికెట్లో 24,000 పరుగులు చేసిన ద్రవిడ్, భారత బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచారు. కోచ్‌గా అండర్-19 ప్రపంచ కప్ (2018), సీనియర్ పురుషుల జట్టుకు T20 ప్రపంచ కప్ (2024) అందించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం.
రోజర్ బిన్నీ: 1983 ప్రపంచ కప్ హీరోలలో ఒకరైన బిన్నీ, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. 2022-25 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.
మిథాలీ రాజ్: మహిళా క్రికెట్లో 10,868 పరుగులు చేసిన మిథాలీ, భారతదేశంలో మహిళా క్రీడకు కొత్త దిశను చూపించారు.
స్టార్ ఆఫ్ ది ఇయర్ గా శుభ్‌మాన్ గిల్
2024-25 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన శుభ్‌మాన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పురుషుల విభాగం)గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు పాలీ ఉమ్రిగర్ ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. మహిళల విభాగంలో స్మృతి మంధాన ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా అవార్డు అందుకోనున్నారు.
అవార్డుల జాబితా ..
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పురుషులు) : శుభ్‌మాన్ గిల్
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) : స్మృతి మంధాన
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : హర్షిత్ రాణా
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : శ్రీ చరణిరంజీ
రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్ రౌండర్ : హర్ దుబే
పరిమిత ఓవర్లలో ఉత్తమ ఆల్ రౌండర్ : ఆయుష్ మాత్రే
రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు (ఎలైట్) : యష్ రాథో
ర్రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (ఎలైట్) : హర్ష్ దుబే
ఉత్తమ అంపైర్ : ఉల్హాస్ గాంధే
డొమెస్టిక్ క్రికెట్లో ముంబై హవాదేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అవార్డు లభించింది. అలాగే వివిధ విభాగాలలో (కూచ్ బెహార్, విజయ్ మర్చంట్ ట్రోఫీ) రాణించిన యువ క్రీడాకారులకు జగ్మోహన్ దాల్మియా, ఎం.ఏ చిదంబరం ట్రోఫీలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా సత్కరించనున్నారు. అయితే ఈసారి విజేతల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు లేకపోవడం గమనార్హం.
READ ALSO: Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?