NTV Telugu Site icon

IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!

Team India

Team India

Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ టూర్‌తోనే గౌతమ్‌ గంభీర్‌ భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే వన్డేలలో సీనియర్లు తప్పక ఆడాలని కోరారట.

వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్‌ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాలు వన్డే మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే వన్డే సిరీస్‌కు సీనియర్లు అందుబాటులో ఉండాలని కోచ్ గౌతమ్‌ గంభీర్‌ కోరినట్లు తెలుస్తోంది.

Also Read: Pekamedalu Movie: తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా.. రూ.50కే సినిమా టికెట్!

ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే.. కేఎల్ రాహుల్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని గౌతమ్‌ గంభీర్‌ భావిస్తున్నాడట. ఇక రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాను సారథిగా, సూర్యకుమార్ యాదవ్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్క టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు దక్కడం కష్టమే. అక్షర్ పటేల్ నుంచి అతడికి పోటీ ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించిన అక్షర్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌లు లంక టూర్‌కు ఎంపిక కానున్నారు.